ఇక మా కొత్త గూడు - మరొక మరువం, http://maruvaka-patram.blogspot.com/
నమస్తే. [మరువం] ఉష గా కొందరికి పరిచితురాలినైనా నేను, మునుపట్లో "మరువం" బ్లాగు తో పాటుగా ఈ తెలుగుబడి కబుర్ల బ్లాగు, జన్యా-తెలుగువెలుగు, నూ నడిపాను. ఈ బ్లాగు ని నిలిపివేసి దాదాపు ఏడాది అయింది. పునఃప్రారంభం ఆవశ్యకమనిపించింది. పిల్లలకి ప్రోత్సాహంగాను, విషయ సమాచారాలు ప్రోగు చేయటానికిను, మా జన్యా సంస్థ విశేషాలు ఇలా కలగూరగంప కబుర్లకి ఒక వేదిక అవసరపడింది. కనుకా... ఇక నుంచి కొత్త బ్లాగు, మరువం, http://maruvaka-patram.blogspot.com/ లో మా ఊసులు చూడండి. వ్యాఖ్యలు మాట తదుపరి సంగతి.
Why change of venue? No particular reason, but some consolidation. Of course you can read my posts here first and then move to my new one.
Saturday, February 19, 2011
కొత్త బ్లాగు "మరువం" కు మారుతున్నాము
Posted by ఉష at 9:39 AM 0 comments
Sunday, April 18, 2010
ఏడాది గడిచిపోయాక, ఎదుగుదల కనపడుతున్నాక..
మరిక ఈ బ్లాగులో ఇది చివరి టపా. ఇక్కడ వ్యాఖ్యలతో, వ్యక్తిగత ఈ-మెయిల్స్ ద్వారాగా ప్రోత్సాహించిన అందరికీ ధన్యవాదాలు - ఉషారాణి.
ఉగాది తో నా తెలుగు బడి మొదటి ఏడాది పూర్తి చేసుకుంది. నిజానికి ఈ బ్లాగు ఒక ఏడాది పాటు మా బడి ఎదుగుదల తెలిపే పట్టిక గా రాసినది. దీన్నుంచి useful and compelling content అన్న ప్రాతిపదిక ఆధారంగా చెప్పింది ఏమీ లేదు. కాకపోతే, తగు సలహాలు, సూచనలు అందటానికి నాకు ఉపయోగపడింది. పిల్లలలో క్రమేణా శ్రద్ద, ఆసక్తి పెరిగాయి. క్రొత్తవారు చేరారు. "నేను బీహార్ లో పెరిగాను, నాకు సరీగ్గా తెలుగు రాదు, కానీ మా పాపకి నేర్పించాలని ఉంది, పంపనా?" అని ఒక తల్లి, భారతదేశానికి తిరిగి వెళ్ళిపోతున్న ఇద్దరు పిల్లలూ "నాకు ఇంకా ఈ బడికి రావాలనుంది" అనటమే నాకు గురుదక్షిణ. అలాగే పాతికేళ్ల యువకుడొకరు ఈ చిన్నారులతో పాటుగా కూర్చుని పాఠాలు నేర్వటం ఒక సరదా. నేను కూడా మరింత ఇష్టంగా వాళ్ళు నేర్చుకునే పద్దతులు అన్వేషిస్తూ, నాకూ ఇదొక అధ్యయనంగా ఉపయోగించుకున్నాను. జాలంలోని ఎన్నో విషయాలు నేను చదివి, వారికి విశదీకరిస్తున్నాను.
ప్రస్తుతం:
- వేమన, సుమతీ శతకాలు వల్లె వేయటం మొదలు పెట్టాము.
- గుణింతాలు, సంయుక్త అక్షరాలు గుర్తుగా/అచ్చుతప్పులు లేకుండా వ్రాస్తున్నారు.
- పుస్తకాలు చదవగలుగుతున్నారు. పండుగలు, వేడుకలు - ఎందుకు చేస్తాము? ఎలా జరుపుతాము? వంటి వివరాలు, మన సంస్కృతి, కట్టుబొట్టు, భాష, ఆహారం, సాంప్రదాయాలు
- కుటుంబ వాతావరణంలోని విషయాలు, చుట్టరికాలు - ఇలా వారికి తెలియాల్సినవి అని నేను నమ్మినవి నేర్చుకుంటున్నారు/తెలుసుకుంటున్నారు.
ప్రతి వారం ఒక ఇంటరాక్టివ్ సామూహిక సాధన - చిట్టిపొట్టి కథలు (మన సామెతలు, పంచతంత్ర, కొంగ-నక్క, కాకి-పిచ్చుక వగైరా); పాటలు (లెక్కలేనన్ని, వీలైనంత అభినయం/నృత్యం కలిపి); నాటకాలు (ఇవి అప్పటికప్పుడు అంశం తీసుకుని వారితోనే సంభాషణలు రాబట్టటం);ఆటలు (వైకుంఠపాళీ/అష్టాచెమ్మా/వామనగుంటలు/..)
నాకు తోచిన మార్పులు, చేర్పుల వలన వారిలో బిడియం తగ్గి, నేనంటే నేనని ఉత్సాహంగా పాల్గొనగలుగుతున్నారు. ఈ ఏడాది మొదట్నుండీ "Student Of The Month" బహుమతులు ఐదారు ఏళ్ళలోపు చిన్నారులే గెలుచుకున్నారు.
ఉదాహరణలు:
పిల్లలకి కూరగాయల పేర్లు పెట్టి, వాళ్ళకి నచ్చే కూర పేరు చెప్పించటం [బెండకాయ - నాకు బెండకాయ వేపుడు ఇష్టం/ వంకాయ - వంకాయ మసాల మా అక్కకి ఇష్టం/ కాకర - మేము తినము], లేదా మేము చెప్పిన రెండు కూరగాయలు చేతులు కలపటం [పాలకూర, టొమాటో; సొరకాయ,ములక్కాయ]. ఇదే ఆట దినుసులు/పప్పుధాన్యాలు తో పొడిగింపు.
అంకెలు ఇచ్చి ఒక్కొక్క అంకెకి వాళ్ళ అవగాహనకి తగిన విశేషణం, వివరాలిస్తూ చర్చలు - రెండు/జత (పౌర్ణమి-అమావాశ్య; రాత్రి-పగలు), మూడు (త్రిమూర్తులు), నాలుగు దిక్కులు, ఐదు (పంచేంద్రియాలు, పంచపాండవులు),..... తొమ్మిది (నవ గ్రహాలు)
రూపు ఇచ్చి వస్తువులు కనుక్కోవటం, బొమ్మలు గీయటం, రంగులు అద్దటం - గుండ్రం - బఠాణి, బంతి, గోళీ...
ఒక పాట వినిపించి/సన్నివేశం చూపించి - అవి పలకల మీద వ్రాయటం/అందులోని వ్యక్తుల సంబంధాలు, సంబాషణలు దేని గురించి అన్న ప్రశ్నోత్తరాలు.
ఈ ఏడాదికి సరిపడా నాకు అంశాలు సిద్దంగా ఉన్నాయి. వాళ్ళతో పాటుగా నేనూ ఇంకా నేర్చుకోగలవి చాలా ఉన్నాయి. ఇలా ఆ బడిని నిరాటంకంగా కొనసాగించగలననే నమ్మకం.
నాకు ఈ సంకల్పం కలగటానికి ఆధ్యాపకవృత్తి పట్ల గల గౌరవం, ఇష్టం కారణమైతే, మీ పిల్లలతో పాటుగా మా వాళ్ళకీ చెప్పండి అన్న తల్లిదండ్రుల అభిమానం మరో కారణం. ఈ ద్వారాగా వస్తున్న ఆదాయం విద్యార్థులకీ, ఆధ్యాపకులకి శిక్షణ ఇప్పించటానికి http://janyaa.org/projects.php వినియోగపడటం అందరికీ ముదావహం.
సెలవిక.
Posted by ఉష at 2:34 PM 2 comments
Sunday, February 7, 2010
ఇక పంతులమ్మకి పాఠాలు!
నవ్వులు పంచే పాఠాలు నేర్చుకోవాలనుందా? కాస్త ఇది చదవండి మరి.
జనవరి నెల కాస్త చలికి వణుకుతూ, బుల్లి బుల్లి బన్నీల్లా, టెడ్డీ బేర్ బొమ్మల్లా, పాపం, మానకుండా వచ్చారు అన్ని క్లాసులకీ దాదాపుగా. మానినవాళ్ళ మాటలివి.
"ఏమ్మా ఎందుకు రాలేదురా?"
.. నేను "అదుర్స్" సినిమాకి వెళ్ళాను. [నేను అదిరిపడ్డానని చెప్పాలా?] :)
.. అమ్మ షాపింగ్ లో లేట్ చేసి నా క్లాస్ మిస్ చేసింది
.. నాకు నిద్ర వచ్చింది
.. మా డాడీకి టాటా చెప్పటానికి ఏర్పోర్ట్ కి వెళ్ళాను
మంచి పంతులమ్మని కనుక "దొంగ జ్వరాలు" రావు వీళ్ళకి. :) రావాలనే పరుగులు తీసి వస్తారు. పదిమంది పిల్లకాయలు, ఒక గురువాంటి అని లెక్కలూ వేస్తారు. ;)
ఈ నెల అంతా పదాలు వల్లె వేయటం, వ్రాయటం మీదనే సాధన జరిపాము.
నేను పదాలు ఇలా విడగొట్టి వ్రాయటం నేర్పాను.
౧. ముందుగా రోమనైజ్డ్ పదంగా వ్రాసి విడగొట్టటం.
iTuka -> i|Tu|ka
౨. తర్వాత ఒక్కో అక్షరం కూర్చటం
i = ఇ
Tu = ట + ఉ = టు
ka = క
iTuka = ఇటుక
ఆ పై విధంగా ప్రతి గుణింతానికీ పదాలు, దాదాపుగా అన్ని హల్లులు వాడి నేర్చాము.
మరి రెండు ఉదాహరణలివి.
bhaarya -> bhaa|rya
bhaa = భ + అ = భా
r!ya = ర ++ య = ర్య [వాళ్ళకి గుణింతం కి వత్తుకి తేడా ఇలా నేర్పాను]
bhaarya = భార్య
attammaa -> a|tta|mmaa
a = అ
t!ta = త + త = త్త
m!maa = మ + అ ++ మ = మా ++ మ = మ్మా
attammaa = అత్తమ్మా
నెలాఖరుకి పిల్లల స్థాయి ఇది.
వైష్ణవి, సాహితి, స్నేహ,నేహ, మేఘన, స్ఫూర్తి, అనీష(సంతు): ఈ ఏడుగురు పిల్లలు "అమ్మ మాట చల్లన, ఆవు పాలు తెల్లన..." పాట మొత్తం తెలుగులో వ్రాయగలిగారు.
శ్రీవల్లి, అలేఖ్య, అనూష, అనీష: నలుగురు తేలిక పదాలు వ్రాయగలుగుతున్నారు.
లలిత్, తేజస్, సంహిత్ : ఈ ముగ్గురు అక్షరాలు వ్రాస్తున్నారు. వీళ్ళు మరీ బుజ్జాయిలు కనుక ఇదే పెద్ద జంప్. మరదే కదా మగపిల్లలు వెనకపడిపోయారు, వెనగ్గా పుట్టారు కాదా మరి. ;)
***************************************
వ్యతిరేక పదాలు : నేను నేర్చిన పాఠాలు
పాత-కొత్త, పెద్ద-చిన్న, పొడుగు-పొట్టి, ఉంది-లేదు, పైన-క్రింద, లోపల-బయట
ఈ వరకు నేను చెప్పి ఇక వాళ్ళని చెప్పమంటే ఇదిగో ;)
పుట్టింది - చచ్చింది [ ఈ మాట కి అంతా నవ్వే సరికి, ఇది ఇదేదో గొప్ప ప్రయోగమనుకుని..]
వచ్చాడు - చచ్చాడు [నేను నవ్వి నవ్వి చచ్చిపోయాను నిజ్జంగా.. ఇది సినిమా పరిజ్ఞామని వేరే చెప్పాలా?]
బతికింది - చచ్చింది [ఆరేళ్ళ సంహిత్ ఈ మాట చెప్పటం వింతే సుమీ!]
అమ్మాయి- అబ్బాయి [ఇదెక్కడి లెక్కబ్బా! ;)]
***************************************
నెమరువేత: పది పదాలు వల్లె వేయించి, తిరిగి చెప్పమన్నాను.
దాదాపుగా అందరికీ ఐదారు పదాల వరకు గుర్తున్నాయి. ఇద్దరు మూడు, మరిద్దరు ఎనిమిది చెప్పారు. ఇది వాళ్ళలో జ్ఞాపకశక్తికి కసరత్తు.
***************************************
జోడు పదాలు : ఇవి వాళ్ళకి తమ చుట్టూ పరిసరాల్లో చూసేవి గొలుసుకట్టుగా రావాలని నేర్పాను.
పిల్లి-ఎలుక; పాలు-పెరుగు; మొక్క-పువ్వు; కాయ-పండు; ఉప్పు-కారం
***************************************
లెక్కలు పెద్దగా చేయలేదు. నూట పదహార్లు, వెయ్యినూట పదహార్లు వంటివి చెప్పుకుని, వందల్లో అంకెల్ని తెలుగులో చెప్పటం ఎలాగో సాధన చేసాం. కొద్దిపాటి కూడికలు కూడా.
***************************************
పాటలు: ఒకటీ అరా పాడినా పైన సాధనకే పెద్దపీఠ ఈ నెల.
త్వరలో ...
ఫిబ్రవరి నెల నుండి అంతా రైటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. దాదాపుగా అన్నీ మన రాష్ట్రానికి చెందిన అంశాలే. ప్రదేశాలు, నదులు, వృక్షాలు. వివరాలు వచ్చే నెలాఖరుకు...
Posted by ఉష at 7:07 AM 4 comments
Saturday, December 12, 2009
క్రిస్మస్ సెలవలకి వెళ్ళేముందు నా తెలుగుబడి కబుర్లు!
క్రిస్మస్ సెలవలు రానున్న కారణంగా ఈ నెల కేవలం రెండు వారాలు మాత్రం క్లాసు ఇచ్చాను. మిగిలిన మూడు వారాలు పంతులమ్మ డుమ్మా కనుక నా బుడుగులూ గప్ చుప్ ;) వివిధ కారణాలతో ముగ్గురు, నలుగురైనా రాలేకపోతున్నారు. కానుకలు మాత్రం అందరికీ పదిలం. మారి నాకో? :( వీళ్ళ కోసం అలా షాపింగ్ చేసి, గిఫ్ట్ రాప్ వేయటం నాకు అదో సంతోషం. లోపల 2010 కాలెండర్, కాండీస్, కీచెయిన్ + పెన్, పెన్సిల్, మార్కర్ వుంచాను. అన్నీ వాళ్ళకి ఉపయోగపడే వస్తువులే.
ముందుగా దశరా, దీపావళి సమయంలో నేర్పిన పండుగ, వేడుక, సంబరాలు, ఉత్సవాలు గురించి మాట్లాడాక క్రిస్మస్ ప్రస్తావన తెచ్చి, అందరినీ ఆ చర్చలో పాల్గొనేలా చేసాను. కనీసం సగం మందికి చాలా విషయాలు గుర్తున్నాయి. పైగా కళ్యాణం, అభిషేకం వంటి క్రొత్త పదాలు కూడా [మరలా కాస్త నటీంచపోతే నాకు నేర్పరు వాళ్ళు :)] చెప్పారు. ఇదొక కిటుకు, వాళ్ళకి తెలిసినవి చెప్పించటానికి కొన్నిసార్లు తప్పదు.
.. గుణింతాలు వల్లె వేయించకుండా పదాలతో ఒకేసారి నేర్పాను. దాదాపుగా అన్ని శబ్దాలకీ ఏదో ఒక పదం పట్టగలుగుతున్నారిప్పుడు.
ఉదా: "క" గుణింతం:
కల, కాకి, కిస్, కీస్, కుక్క, కూర, కృష్ణ, క్రూరమృగం, కెటిల్, కేక్, కొన్ని, కోతి, కైట్, కంచం
ఇప్పుడు గుణింతాలు, వత్తులు, సంయుక్త అక్షరాలు [ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలు] కూడా దాదాపుగా చెప్తున్నారు.
.. మరికొన్ని పదాలు చాలా కూలంకషగా తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మారుస్తూ, వ్యాక్యాల్లో కూడా ప్రయోగించి నేర్చుకున్నాము. ఇవి మాత్రం ఉద్దండపండితులైపోయారు.
ఎవరు, ఎలా, ఎట్లా, ఏమిటి, ఏంటీ, ఏమని, ఎంత, ఎన్ని, ఎక్కడ, ఎందుకు, ఎందరు, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎందుకైనా, ఎన్నడూ, ... ఇలా చాలా సందర్భాన్ని బట్టి వాడే పదాలు.
.. లెక్కల్లో - ఒకరు, ఇద్దరు... ఏడుగురు ఇలా మొదలైన లెక్క ఎనిమిది సుమారుల్లో "ఎనిమిది మంది" కి మారటం. వంద తర్వాత నూటఒకటి కి మారటం వగైరా నేర్చాము.
ఇవి కాక ఒక మాటకో, పాటకో అభినయించటం కూడా చేసాము. అన్నీ వ్రాయను అంత ముఖ్యంగా అనిపించటం లేదు. కానీ అంతా నాకు హగ్స్ ఇచ్చి వచ్చే యేడు కలుస్తామని వెళ్ళారు.
Posted by ఉష at 7:37 PM 6 comments
Sunday, November 22, 2009
నవంబర్ నెలలో నేర్చిన పాఠాలు
*** వచ్చే వారం "థాంక్స్ గివింగ్ సెలవుల" వలన క్లాస్ లేదు. ఇవి నవంబర్ నెల పాఠాల వివరాలు.
ఈ తెలుగు పాఠాలు విదేశంలో పెరుగుతున్న పిల్లలకి చెప్తున్నవి కనుక దాదాపుగా వాళ్ళంతా అతి తక్కువగా తెలుగు మాట్లాడివుంటారు కనుక, పిన్న వయస్కులు కనుక పాఠాలు కాస్త క్రొత్తగా ఆట, పాటలు కలిపి చెప్తాను. ఈ విధంగా వాళ్ళలో క్లాసుకి రావాలన్న ఉత్సాహం కనపడుతుంది.
.. అక్షరమాల లోని అచ్చులు, హల్లులు అన్నీ పెద్ద పిల్లలు గుర్తించ గలిగి, పలికి, సరళమైన పదాలు, వాక్యాలు వ్రాయగలుగుతున్నారు.
ఉదా: గారెలు, నాకు పాలు కావాలి
.. మనం నేర్చుకున్నట్లుగా కాక కాస్త మార్పుతో నేర్పుతున్నాను.
ఉదా:
** సున్న వ్రాసి, దాన్నుంచి వచ్చే అక్షరాలు ఒక సమూహం లో - మ,య, ప, వ, అ, ఆ, ర ....
** డబ్ల్యు వ్రాసి దాన్నించి వచ్చే అక్షరాలు - చ, ఐ, ఉ, జ ...
** యెస్ వ్రాసి - క, క్ష
.. అక్షరాల తేడాలు తెలుసుకున్నారు. ఒకటి చెప్తే దానికి క్లోజ్ కజిన్ గురించి చెప్తున్నారు.
ఉదా: స, న; ప, వ; మ య
.. వత్తులు తెలుసుకున్నారు.
.. గుణింతాలలోని ఎక్సెప్షన్స్ దాదాపుగా గుర్తుపడుతున్నారు.
ఉదా: క -కు; ర - రు; వ -వు [మ అని ఎందుకు వ్రాయరు?]
.. వత్తులు, గుణింతాలు కలిపిన అక్షరాలు పలకటం, అవి వున్న పదాలు గుర్తించటం
ఉదా: స్నేహ, స్ఫూర్తి, జన్యా, అమ్మమ్మ, అన్నయ్య, నేర్పే...
.. చిన్నారులు [ఐదారేళ్ళ వయసు వారు] కూడా ఆసక్తిగా నేర్చుకుంటున్నారు.
.. ఇప్పుడు ఇద్దరిద్దరిని కలిపి టీం వర్క్ చేయిస్తున్నాను.
.. పాట:
- అమ్మ కు జై జై
.. కథ:
- చాలా చెప్పుకున్నాం. మీకు అవన్ని చెప్పం. ;)
Posted by ఉష at 3:21 PM 2 comments
Saturday, October 31, 2009
అక్టోబర్ పాఠాలు
ఈ నెల పిల్లలంతా తిరిగివచ్చారు. ఇప్పుడు మా బళ్ళో పిల్లలు, పంతులమ్మల పేర్లివి. ;)
పంతుళ్ళు-పంతులమ్మలు:
అలేఖ్య
అనీష
అనీష [సంతు]
అనూష
మేఘన
నేహ
వైష్ణవి
స్నేహ
సాహితి
సంహిత్
స్ఫూర్తి
శ్రీవల్లి
లలిత్
తేజస్
పిల్ల:
నేనే ;) - వాళ్ళంతా ఇప్పుడు నాకు పాఠాలు నేర్పేవారే ...
********************************************
ఈ నెల ఎన్నో చేసాం. అన్నీ తెలుపలేనేమో. అయినా చిన్న ప్రయత్నం.
.. మా లేక్ లోని చేపలకి బ్రెడ్ వేయిస్తూ వాళ్ళతో ఆ చుట్టూ పరిసరాల మీద వ్యాఖ్యానం చేయించాను.
ఉదా: చేపకి రొట్టె పెడుతున్నాను; ఇక్కడ పక్షులు వున్నాయి.
.. జంతువులు, పక్షులు పేర్లు నేర్చుకున్నాము
.. ఒక్కొక్కరికి ఒక అంశం ఇచ్చి రెండు నిమిషాల చొప్పున మాట్లాడించటం
.. దసరా పండుగ ఎందుకు చేసుకుంటాం?
.. ఒకరు చేసే మూగ సైగని మరొకరు చూసి అర్థం చెప్పటం.
.. కూరగాయల పేర్లు - వాటితో ఒక కథ - దోసకాయంత దొంగోడు
.. అక్షరాలు వ్రాయటం లోని తేడాలు వివరించాను
ఉదా: ల [ఒకటే గీత], స [రెండు కానీ కలవవు], క [రెండు గీతలు కలిపి వ్రాయటం]
.. పదాలు వాడి నేను చెప్తే వాళ్ళూ కొన్ని గొలుసుకట్టు పదాలు కూర్చటం
ఉదా: చెరువులో చేపలు, మొక్కమీద పువ్వులు
.. ఉచ్చారణ దోషాలు పోవటానికి కష్టమైన పదాల సాధన
ఉదా: [పెళ్ళి, కిళ్ళీ, కొడిగినహళ్ళీ, బిసిభళేబాత్]; [కాకర, కీకర, కీసర, బాసర] ... ఇలా గుక్కతిప్పుకోకుండా వల్లెవేయటం :)
*********************************************
పాట:
.. చిట్టి పొట్టీ మిరియాలు
.. దేవీ స్తోత్రం
.. పిల్లల చేత సినిమా పాటల్లోని పదాలు గుర్తింపచేయటం
Posted by ఉష at 12:45 PM 4 comments
సెప్టెంబర్ పాఠాలు
ఈ నెల విశేషం: స్కూల్లో వారికి క్రొత్త తరగతి మొదలుపెట్టినట్లే నేను వారి చేత వ్రాయించటం మొదలు పెట్టాను. :)
అందరికీ చిన్న వైట్ బోర్డ్, ఇరేశబుల్ డ్రై మార్కర్ కానుకగా ఇచ్చాను. అదీకాక వాళ్ళ క్రెడిట్ పాయింట్స్ చూసి అందరికీ మార్కర్స్ సెట్ ప్రెసెంట్ చేసాను. ఈ చిన్ని చిన్ని సరదాలు వాళ్ళలో నేర్చుకోవాలన్న ఉత్సాహాన్ని పెంచుతాయని నా ఆలోచన.
.. మొదట వాళ్ళతో అచ్చులు వ్రాయించి, ఆ తర్వాత వ్రాయించిన రెండక్షరాల పదాలు మచ్చుక్కి కొన్ని:
అల, తల, వల, కల, జడ, ఆట, పాట, పాలు
.. వత్తులు కలిపి, రెండు అక్షరాల శబ్దాలు కలిపి పదాలు
అక్క, అత్త, అట్ట, నవ్వు, పువ్వు, చిక్కని, నీళ్ళు
****************************************
పాటలు:
.. బుర్రు పిట్ట బుర్రు పిట్ట
.. చిట్టి పొట్టి మిరియాలు
.. ఒప్పులకుప్ప వయ్యారిభామ
Posted by ఉష at 12:14 PM 2 comments

